: సీఎం కేసీఆర్ ను కలసిన కోదండరాం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను క్యాంపు కార్యాలయంలో టీ.జేఏసీ చైర్మన్ కోదండరాం కలిశారు. మే 1న జరిగే తన కుమారుని వివాహానికి సీఎంను ఆహ్వానించి పెళ్లి పత్రిక అందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో సన్నిహితంగా ఉన్న కేసీఆర్, కోదండరాంలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకరినొకరు కలిసే సమయం ఎప్పుడూ రాలేదు. ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాల కారణంగా దూరం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో కోదండరాం ఇప్పుడు తనయుడి వివాహానికి ఆహ్వానించడానికి కలవడం జరిగింది.

  • Loading...

More Telugu News