: రూ. 84 కోట్ల స్కాలర్ షిప్ లక్ష్యంగా అడ్వాన్స్డ్ రోబోను తయారు చేస్తున్న ముంబై టీనేజర్లు


ఆస్ట్రేలియాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఫస్ట్ టెక్ చాలెంజ్ (ఎఫ్టీసీ) కోసం ముంబై యువత అడ్వాన్స్డ్ రోబోను తయారు చేసింది. జుహూలో తయారైన ఈ రోబో తన యుక్తిని ఉపయోగిస్తూ, చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులను ఏరుతుంది. పొడవైన సిలిండర్లలోకి గురిచూసి బాల్స్ విసురుతుంది. 'ఆర్ ఫ్యాక్టర్'కు చెందిన 9 మంది దీనిని రూపొందించారు. ఈ రోబో అంచనాలను అందుకుంటే వీరికి 13.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 84 కోట్లు) స్కాలర్ షిప్ అందుతుంది. ఈ రోబో బాల్స్ ను సేకరించి వివిధ రకాల ఎత్తుల్లో ఉన్న బాస్కెట్లలోకి విసురుతుందని, కేవలం 45 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుందని ఆర్ ఫ్యాక్టర్ విద్యార్థి, మిహిర్ షా వివరించారు. పోటీల్లో పాల్గొనేందుకు మరికొద్ది రోజులు మాత్రమే ఉండడంతో రోబోను మరింత పర్ ఫెక్ట్ గా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. రీజనల్, నేషనల్ స్థాయి పోటీల తరువాత తమ ప్రయోగం ఆస్ట్రేలియాకు ఎంపికైందని తెలిపారు.

  • Loading...

More Telugu News