: 'హిందీ దివస్' పురస్కారాల నుంచి ఇందిరా, రాజీవ్ గాంధీల పేర్ల తొలగింపు


కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు అవార్డుల పేర్లను మార్చింది. 'ఇందిరా గాంధీ రాజభాష పురస్కార్', 'రాజీవ్ గాంధీ రాష్ట్రీయ గ్యాన్-విజ్ఞాన్ మౌలిక్ పుస్తక్ లేఖన్ పురస్కార్' అనే అవార్డులు ఇక నుంచి 'రాజభాష కీర్తి పురస్కార్', 'రాజభాష గౌరవ్ పురస్కార్' పేర్లతో ప్రదానం చేయనున్నారు. ప్రభుత్వంలో భాషాభివృద్ధి ఉపయోగం కింద ప్రతి సంవత్సరం 'హిందీ దివస్' రోజున కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ పురస్కారాలను ఇస్తుంది. ఈ మేరకు మార్పులు చేసిన అవార్డుల పేర్లు గత నెల అంటే మార్చి 25 నుంచి అమల్లోకి రానున్నట్టు హోం శాఖ ఆదేశంలో తెలిపింది. పురస్కారాల పేర్లు మార్చడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది.

  • Loading...

More Telugu News