: ధోనీ ఫిర్యాదు... చిక్కుల్లో పడ్డ మ్యాక్స్ మొబైల్ సంస్థ
మ్యాక్స్ మొబైల్ తయారీ సంస్థ ఒప్పందానికి విరుద్ధంగా తన పేరును ఉత్పత్తులపై వాడుకుంటోందని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హైకోర్టులో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో, కోర్టు 'మ్యాక్స్' స్పందన కోరింది. కాగా, న్యాయస్థానం అంతకుముందే, ధోనీ పేరును వాణిజ్యపరంగా వినియోగించరాదని సదరు సంస్థను ఆదేశించింది. అయితే, మ్యాక్స్ మొబైల్ కంపెనీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని, ఇంకా తన పేరును వాడుకుంటోందని ధోనీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జస్టిస్ సురేశ్ కైత్... మ్యాక్స్ మోబిలింక్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ డైరక్టర్ అజయ్ ఆర్ అగర్వాల్ కు 'కాంటెప్ట్ ఆఫ్ కోర్టు' (కోర్టు ధిక్కారం) నోటీసులు పంపారు. తనతో ఒప్పందం కింద రూ.10 కోట్ల మేర బకాయిలు చెల్లించలేదని, మ్యాక్స్ తో తన ఒప్పందం 2012తోనే ముగిసిందని, అయినా తన పేరును వినియోగించుకుంటూనే ఉన్నారని ధోనీ తన ఫిర్యాదులో ఆరోపించాడు.