: అందరి చూపు యువీపైనే... ఊపందుకుంటున్న డేర్ డెవిల్స్ బ్యాటింగ్
ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో మ్యాచ్ లో టాస్ నెగ్గిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో, బ్యాటింగ్ కు దిగిన డేర్ డెవిల్స్ 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 69 పరుగులు చేశారు. అయ్యర్ అవుట్ కావడంతో డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ బరిలో దిగాడు. ఈ మ్యాచ్ లో యువీ ఎలా ఆడతాడన్న దానిపై అందరిలో ఉత్సుకత నెలకొంది. ప్రస్తుతం యువరాజ్ 3 పరుగులతో, తివారీ 21 పరుగులతో ఆడుతున్నారు.