: నారా లోకేశ్ పై కేఈ ప్రశంసల జల్లు


టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా లోకేశ్ అభిమానుల జాబితాలో చేరారు. కేఈ నేడు మీడియాతో మాట్లాడుతూ, లోకేశ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. లోకేశ్ నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకుంటున్నారని, ఆయనది కష్టించే స్వభావమని, కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఇటీవల నిర్వహించిన బస్సు యాత్ర విజయవంతం అయిందన్నారు. లోకేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే బావుంటుందని భావిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News