: ఈ సినిమాలో 50 పాటలు!
మామూలుగా భారతీయ సినిమాల్లో ఐదో ఆరో పాటలుంటాయి. కొన్ని సినిమాల్లో పది కూడా ఉంటాయి. కానీ, ఈ కన్నడ సినిమాలో ఏకంగా 50 పాటలు ఉంటాయట. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి కె.నంజుండ దర్శకుడు. ఎల్ఎన్ శాస్త్రి సంగీత దర్శకుడు. ఈ ఏడాది చివరికి షూటింగ్ పూర్తవుతుందని భావిస్తున్నారు. దక్షిణాది భాషల్లో ఇన్నేసి పాటలున్న చిత్రం ఇదే కానుంది. కాగా, హిందీలో 1932లో వచ్చిన 'ఇంద్రసభ' అనే చిత్రంలో 71 పాటలున్నాయి. సినిమాలో అవసరమైన మేరకే డైలాగులుంటాయని, కథను సంగీతమే ముందుకు నడిపిస్తుందని దర్శకుడు చెబుతున్నాడు.