: పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దులో చైనా విమానాశ్రయం... ఆందోళనలో భారత్
మొన్న శ్రీలంక, తాజాగా పాకిస్థాన్... భారత పొరుగు దేశాలతో చైనా మైత్రి నానాటికీ బలోపేతమవుతోంది. అదే సమయంలో భారత్ లో ఆందోళన స్థాయిని కూడా పెంచుతోంది. శ్రీలంకలో నౌకాశ్రయాన్ని వాడుకున్న చైనా, తాజాగా పాకిస్థాన్ అధీనంలోని కాశ్మీర్ సరిహద్దులో ఏకంగా విమానాశ్రయాన్నే నిర్మిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహధ్దుకు ఆనుకుని ఉన్న జిన్ జియాంగ్ లో సముద్ర మట్టానికి 2,480 అడుగుల ఎత్తులో చైనా ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తోంది. గత వారం చైనా విమానయాన శాఖాధికారులు జిన్ జియాంగ్ ను సందర్శించడమే కాక, ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని కూడా ఖరారు చేశారట. చైనా తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ ఆందోళన చెందుతోంది. విమానాశ్రయం ఏర్పాటుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చైనా తన నిర్మాణాలను శాశ్వతం చేసుకునేందుకే ఈ చర్యలు చేపడుతోందని అనుమానిస్తోంది. అయితే ఈ విషయంలో భారత్ ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని చైనా వాదిస్తోెంది.