: ఇండియాలో రెట్టింపైన 'ధూమపాన' మహిళలు: పీహెచ్ఎఫ్ఐ నివేదిక


భారతదేశంలో పొగ తాగుతున్న మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోందని, గడచిన 15 సంవత్సరాల్లో ధూమపానాన్ని అలవాటు చేసుకున్న మహిళల సంఖ్య రెట్టింపు అయిందని పీహెచ్ఎఫ్ఐ (పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా) తన తాజా నివేదికలో వెల్లడించింది. 1996 సంవత్సరం ప్రాంతంలో కేవలం 10 శాతం మంది మహిళలు మాత్రమే పొగ తాగేవారని, ఆ సంఖ్య 2010 నాటికి 20 శాతానికి చేరిందని తెలిపింది. ఇదే సమయంలో పురుషుల సంఖ్య అంతగా పెరగలేదని, పురుషుల్లో 45 నుంచి 57 శాతం మంది పొగతాగేవారున్నారని పేర్కొంది. 'మహిళా సాధికారత' అంటూ చేస్తున్న ప్రచారం సైతం ధూమపాన మహిళల సంఖ్య పెరిగేందుకు కారణమైందని పీహెచ్ఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళల్లో ఆర్థిక స్వాతంత్ర్యం పెరగడం, సాంఘిక వృద్ధి తదితరాంశాలు మహిళలను పొగాకుకు దగ్గర చేస్తున్నాయని పీహెచ్ఎఫ్ఐ, హెల్త్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ మోనికా అరోరా తెలియజేశారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో సైతం పొగతాగే అలవాటు పెరుగుతోందని ఆమె వివరించారు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటీమణులు పొగతాగే సన్నివేశాలు చోటు చేసుకోవడం కూడా ఇందుకు కారణమని అన్నారు.

  • Loading...

More Telugu News