: మందులో సోడా పోసినోళ్లకే మంత్రి పదవులు!: కేసీఆర్ పై రేవంత్ ధ్వజం


తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీటీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి మాటల దాడి మరింత పదునెక్కింది. తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న రేవంత్ రెడ్డి రోజుకో కొత్త రకం విమర్శలతో గులాబీ దళపతిపై విరుచుకుపడుతున్నారు. నిన్న వనపర్తిలో జరిగిన సమావేశంలో భాగంగా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మందులో సోడా పోసినోళ్లకే మంత్రి పదవులు’ లభిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆంద్రోళ్ల కమీషన్లకు కేసీఆర్ దాసోహమయ్యారని విమర్శించిన రేవంత్ రెడ్డి, వలస నేతలకే మంత్రి పదవులు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ఒక్క మహిళకు కూడా తెలంగాణ కేబినెట్ లో మంత్రి పదవి ఇవ్వలేని పరిస్థితి ఎందుకుందని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News