: మరో వర్థమాన ఆటగాడి ప్రాణం తీసిన క్రికెట్


జంటిల్మన్ గేమ్ క్రికెట్ ఆడుతూ ప్రాణం పోగొట్టుకుంటున్న యువ ఆటగాళ్ల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఈస్ట్ బెంగాల్ క్లబ్ క్రికెటర్ అంకిత్ కేసరి మూడు రోజుల క్రితం మైదానంలో కుప్పకూలగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఈ ఉదయం మరణించాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సీినియర్ నాకౌట్ పోటీల్లో భాగంగా ప్రత్యర్థి జట్టు, భవానీపూర్ క్లబ్ ఆటగాడు కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు అంకిత్ తో పాటు మరో ఆటగాడు సౌరవ్ మండల్ పరుగుపెట్టాడు. ఈ ప్రయత్నంలో ఒకరినొకరు గట్టిగా ఢీకొట్టుకోగా, అంకిత్ మైదానంలోనే కుప్పకూలాడు. వెంటనే కోల్ కతా సిటీ ఆసుపత్రికి అంకిత్ ను తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. 1994, అక్టోబర్ 28న జన్మించిన అంకిత్ బెంగాల్ అండర్ 19, ఈస్ట్ జోన్ అండర్ 19, బెంగాల్ అండర్ 23 తదితర జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ, 47 మ్యాచ్ లు ఆడాడు.

  • Loading...

More Telugu News