: నిమ్స్ ఆసుపత్రిలో మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మికంగా సందర్శించి, తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రత, రోగులకు అందుతున్న సదుపాయాలు, సౌకర్యాలపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో ఆపరేషన్ థియేటర్లు, శస్త్రచికిత్స వార్డుల వద్ద అధికారుల పని తీరును ఆరా తీశారు.