: విపక్షాల నినాదాలతో లోక్ సభ కొద్దిసేపు వాయిదా
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై లోక్ సభలో దుమారం చెలరేగింది. ఆయన క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సహా ఇతర విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. మరోవైపు స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దాంతో సభను 11.45కు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు నెలల తరువాత తిరిగొచ్చిన క్రమంలో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి విషయంలోనూ ఇరుకున పెట్టాలన్న నిర్ణయంతో ఉంది. ఈ క్రమంలో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటోంది.