: మోహన్ బాబుకు 'యాక్టర్ ఆఫ్ ద మిలీనియం' అవార్డు
డైలాగ్స్ చెప్పడంలో తనకంటూ ప్రత్యేక శైలిని సృష్టించుకుని, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న మోహన్ బాబు 'యాక్టర్ ఆఫ్ ద మిలీనియం' అవార్డు అందుకున్నారు. కేంద్రమంత్రి చిరంజీవి, అక్కినేని చేతుల మీదుగా మోహన్ బాబు ఈ పురస్కారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన కెరీర్లో ఇప్పటివరకు 550కి పైగా సినిమాల్లో నటించానని, యాభైకి పైగా చిత్రాలు నిర్మించానంటూ.. ఇన్ని సినిమాలు పూర్తి చేశానంటే నమ్మశక్యం కాకుండా ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సుబ్బరామిరెడ్డికి మరింత మంచి చేకూరాలని ఆశిస్తున్నట్టు మోహన్ బాబు పేర్కొన్నారు.
ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు టీఎస్సార్ అవార్డు దక్కింది. కాగా, 2012 సంవత్సరానికి గాను అనుష్క (ఢమరుకం) కు ఉత్తమ నటి అవార్డు ప్రదానం చేశారు. చిరంజీవి ఈ అవార్డు బహూకరించారు. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హాకు 'మిలీనియం సెన్సేషనల్ యాక్టర్' పురస్కారం ప్రదానం చేశారు.