: నా జీవితం తెలుగు జాతికి అంకితం: జన్మదిన సందేశంలో చంద్రబాబు


‘‘నా జీవితం తెలుగు జాతికి అంకితం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి’’ అని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో దివంగత నందమూరి తారకరామారావు విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు, ఆ తర్వాత కార్యకర్తల నుద్దేశించి మాట్లాడారు. తన జీవితం తెలుగు జాతికి అంకితమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నేతలు కార్యాలయంలో ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News