: నటి భువనేశ్వరి ఇంటిని ఆక్రమించేశారట... అన్నూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు!
టాలీవుడ్ లోనే కాక దక్షిణాది భాషల చలన చిత్రాల్లోనూ ఓ వెలుగు వెలిగిన నటి భువనేశ్వరి ఇల్లు ఆక్రమణకు గురైందట. ఈ మేరకు ఆమె చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకెళితే... తమిళనాడులో కోవై జిల్లా అన్నూర్ గ్రామంలో భువనేశ్వరికి ఇల్లు, థియేటర్ ఉన్నాయి. 2012లో వీటిని విక్రయించాలని భావించి, సుబ్రహ్మణియన్ అనే వ్యాపారవేత్తను సంప్రదించారట. అయితే భువనేశ్వరికి తెలియకుండా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన సుబ్రహ్మణియన్ వాటిని ఆక్రమించేశారట. విషయం తెలుసుకున్న భువనేశ్వరి అన్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుబ్రహ్మణియన్ అధీనంలోని తన ఇల్లు, థియేటర్లను తనకు అప్పగించాలని ఆమె ఆ ఫిర్యాదులో పోలీసులను కోరింది. భువనేశ్వరి ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.