: పార్టీ పరువును బజారున పడేశారు... గల్లా, సీఎం రమేశ్ లకు చంద్రబాబు చీవాట్లు!
ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం సిగపట్లకు సిద్ధమైన టీడీపీ ఎంపీలు సీఎం రమేశ్, గల్లా జయదేవ్ లకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తలంటారు. క్రీడా సంఘాల పదవి కోసం బజారుకెక్కి, పార్టీ పరువును మంటగలుపుతున్నారంటూ ఆయన నిన్న వారిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం గల్లా జయదేవ్, సీఎం రమేశ్ ఎవరికి వారు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో నిన్న ఇరువురూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. విషయం తెలిసిన చంద్రబాబు ఈ రాద్ధాంతంపై అసహనం వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చండి, లేని పక్షంలో వారిద్దరినీ ఆ పోటీ నుంచి తప్పించి మూడో వ్యక్తికి ఆ పదవిని అప్పజెప్పండని ఆయన పార్టీ నేతలకు సూచించారట.