: ఏపీలో వాటర్ రిసోర్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం: చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో వాటర్ రిసోర్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని తెలిపారు. జల సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ... వాటర్ రిసోర్స్ వర్శిటీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నీరు-చెట్టు కార్యక్రమంలో సర్పంచ్ నుంచి సీఎం వరకు అందరూ భాగస్వాములవుతారని వివరించారు. చెరువుల పూడికతీత, భూగర్భ జలాల అభివృద్ధి వంటి అంశాలపై దృష్టిపెడుతున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News