: కష్టాల్లో సూపర్ కింగ్స్... 68 పరుగులకే 4 వికెట్లు డౌన్


రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కష్టాల్లో పడింది. 10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు చేజార్చుకుని 68 పరుగులే చేసింది. భారీ హిట్టర్లుగా పేరుగాంచిన మెక్ కల్లమ్ (12), రైనా (4), డు ప్లెసిస్ (1) తీవ్రంగా నిరాశపరిచారు. ఓపెనర్ డ్వేన్ స్మిత్ 40 పరుగులు చేసి ఫాక్నర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. క్రీజులో ప్రస్తుతం కెప్టెన్ ధోనీ, బ్రావో ఉన్నారు. అహ్మదాబాదులోని మొతేరా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ కు దిగింది.

  • Loading...

More Telugu News