: లక్ష కోట్లు దండుకున్న జగన్ కు అందరూ అలాగే కనిపిస్తున్నారు: ఏపీ హోం మంత్రి చినరాజప్ప
వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శనాస్త్రాలు గుప్పించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దండుకున్న జగన్ కు మిగిలిన వారందరూ తనలాగే కనిపిస్తున్నారని ఆయన ఎధ్దేవా చేశారు. పట్టిసీమ పేరిట సీఎం నారా చంద్రబాబునాయుడు రూ.300 కోట్ల మేర నిధులను జేబులో వేసుకునేందుకు యత్నిస్తున్నారన్న జగన్ ఆరోపణలపై చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమతో రాయలసీమకు తాగు, సాగు నీరందుతుందని ఆయన పేర్కొన్నారు.