: ఏచూరికి ఈ సారైనా ఛాన్స్ దక్కేనా?... విశాఖలో సీపీఎం జాతీయ కార్యదర్శి ఎంపిక నేడే!
సీపీఎంలో ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి కీలక నేత. జాతీయ ప్రధాన కార్యదర్శులు ఎంతమంది మారినా, సుదీర్ఘకాలంగా పోలిట్ బ్యూరోలో సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్న ఆయన, ఢిల్లీలోనే కాక దేశంలోనే ఆ పార్టీకి గొంతుకగా మారారు. అయితే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి మాత్రం ఇప్పటిదాకా ఆయనకు అందని ద్రాక్షగానే మారింది. తాజాగా ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేడు విశాఖలో ముగియనున్నాయి. ముగింపు కార్యక్రమంలో భాగంగా పార్టీ జాతీయ కార్యవర్గంతో పాటు పోలిట్ బ్యూరో, జాతీయ ప్రధాన కార్యదర్శిని కూడా ఎన్నుకోనున్నారు. పార్టీలో కీలక నేతగా కొనసాగుతూ వస్తున్న సీతారాం ఏచూరీతో పాటు మరికొందరు నేతల పేర్లు ఈ పదవి రేసులో ఉన్నట్లు వినిపిస్తోంది. నేటి మధ్యాహ్నం లోగా ఈ పదవి ఎవరికి దక్కుతుందన్న విషయం తేలిపోనుంది.