: మస్తాన్ భౌతికకాయానికి విమానంలో చోటు దక్కేలేదు...మృతదేహం తరలింపులో మరింత ఆలస్యం


ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు భౌతిక కాయానికి విమానంలో చోటు దక్కలేదట. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. ఆండీస్ పర్వతారోహణకు వెళ్లిన మల్లి మస్తాన్ బాబు ప్రతికూల వాతావరణం నేపథ్యంలో మంచుకొండల్లోనే తుది శ్వాస విడిచారు. దాదాపు పది రోజుల తర్వాత ఆయన మృతదేహాన్ని కనుగొన్న అర్జెంటీనా అధికారులు, ఆయన భౌతికకాయాన్ని భారత్ పంపేందుకు ఏర్పాట్లు చేశారు. నిన్న రాత్రే ఆయన భౌతిక కాయం అక్కడినుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో విమానంలో మల్లి మస్తాన్ బాబు భౌతిక కాయానికి చోటు దక్కలేదట. దీంతో నేటి రాత్రికి గాని ఆయన మృతదేహం అర్జెంటీనా నుంచి బయలుదేరే అవకాశాలు లేవు. దీంతో మస్తాన్ బాబు భౌతిక కాయం తరలింపులో మరో రెండు రోజుల పాటు జాప్యం తప్పడం లేదు.

  • Loading...

More Telugu News