: గోదావరి జిల్లాలపై తగ్గని వరుణుడి కోపం


ఉభయ గోదావరి జిల్లాలను వర్షం ఇంకా వీడలేదు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా అంతటా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి రైతులు తమ పంటను కోల్పోయి లబోదిబోమంటున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు తదితర ప్రాంతాలు భారీ వర్షం కారణంగా అతలాకుతలం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతలు పూర్తి అయి, పొలాల్లో రాశులుగా పోసిన వరి పూర్తిగా తడిసినట్టు తెలుస్తోంది. ఇక కోతలు పూర్తి కాని చోట్ల నీరు ఎక్కువగా నిలిచి పంట నేలకు ఒరిగింది. ధాన్యం మొలకెత్తి పనికిరాకుండా పోతుందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News