: సన్ రైజర్స్ విజయ లక్ష్యం 168 పరుగులు
ఐపీఎల్-8లో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరుగుతున్న పోరులో సన్ రైజర్స్ తో తలపడ్డ ఢిల్లీ డేర్డెవిల్స్ 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ అయ్యర్ 60, డుమిని 54 పరుగులు చేసి రాణించారు. యువరాజ్ మరోసారి నిరుత్సాహపరచాడు. 168 పరుగుల లక్ష్యంతో హైదరాబాద్ జట్టు బరిలోకి దిగగా, ఓపెనర్లు వార్నర్, ధావన్ నిదానంగా ఆడుతున్నారు. వికెట్ నష్టపోకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. దీంతో హైదరాబాద్ జట్టు 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది.