: ఐటీ చెల్లింపులకూ ఆధార్ లింకు


పన్ను చెల్లింపుదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల సంఖ్యను తగ్గించేందుకు ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ మాధ్యమంగా రిటర్నులు దాఖలు చేస్తున్న వారు ఇకపై ప్రత్యేకంగా ITR-V పై సంతకం చేసి పంపాల్సిన అవసరం లేకుండా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం 'ఆధార్' కార్డును అనుసంధానం చేయాలని నిర్ణయించామని తెలిపింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డు అఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) 2015-16 ఇన్ కం టాక్స్ రిటర్న్స్ ఈ-ఫైలింగ్ లో కొత్త కాలమ్ ను ప్రవేశపెట్టి ఆధార్ సంఖ్యను అడుగుతున్నారు. ఆధార్ సంఖ్య వెల్లడించిన తరువాత రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ కు వన్ టైం పాస్ వర్డ్ గా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ ను పంపుతారు. దాన్ని తిరిగి ఎంటర్ చేయడం ద్వారా రిటర్న్స్ ఫైల్ చేయవచ్చని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News