: జయసుధ ఓటమితో బాధేసింది : మంచు లక్ష్మి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో సహజనటి జయసుధ ఓడిపోవడం పట్ల తాను చాలా బాధ పడ్డానని మోహన్ బాబు కుమార్తె, నటి, నిర్మాత మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు. సాటి మహిళ కాబట్టే ఆమెకు మద్దతిచ్చానని తెలిపారు. మా ఎన్నికల్లో ఒక మహిళ తొలిసారి పోటీ చేశారని ఆమె గుర్తుచేశారు. కాగా, మా ఉపాధ్యక్షురాలిగా తాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని మంచు లక్ష్మీ సంతోషం వ్యక్తం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ ఆమె కృతఙ్ఞతలు తెలిపారు. తెలుగు సినీ కార్మికుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె అన్నారు. మా అధ్యక్ష ఎన్నికల్లో జయసుధపై రాజేంద్ర ప్రసాద్ 85 ఓట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.