: తొలిసారి విమానం నడిపింది రైట్ సోదరులు కారట!


ప్రపంచంలో మొదటిసారిగా విమానం నడిపింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూ ఉన్నదే. రైట్ సోదరులు అనేగా మీ సమాధానం కూడా? కానీ, తాజాగా కనెక్టికట్ నేతలు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. తొలిసారి విమానం నడిపింది వారు కాదని వాదిస్తున్నారు. 1903లో ఒర్విల్లీ, విల్ బుర్ రైట్ కాలిఫోర్నియాలో తొలి విమానం ఎక్కడానికి రెండేళ్ల ముందే, గుస్తావే వైట్ హెడ్ అనే వ్యక్తి బ్రిడ్జిపోర్ట్ లో గాలిలో ప్రయాణించాడని "జస్టిస్ డిలేయిడ్ ఈజ్ జస్టిస్ డినైడ్" పేరిట 'వీక్' పత్రికలో రెండోసారి వచ్చిన కథనం సంచలనం సృష్టిస్తోంది. వైట్ హెడ్ ను చరిత్ర సరిగా ప్రస్తావించలేదని పత్రిక వ్యాఖ్యానించింది. జర్మనీ నుంచి వలస వచ్చిన వైట్ హెడ్ 1901, ఆగష్టు 14న ఫెయిర్ ఫీల్డ్ సమీపంలో విమానంలో 50 అడుగుల ఎత్తున ప్రయాణిస్తూ, ఒకటిన్నర కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడని పేర్కొంది. ఈ ఆర్టికల్ ను పాల్ జాక్సన్ రాశారు. ఈ ఆర్టికల్ కు అక్కడి ప్రజా ప్రతినిధులు సైతం మద్దతిస్తూ, ఇప్పటికైనా చరిత్ర మార్చి వైట్ హెడ్ పేరును ప్రపంచానికి తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News