: ప్రియురాలుని 150 అడుగుల కొండపైనుంచి తోసేశాడు


ప్రేమించానన్నాడు...పెళ్లిచేసుకుంటానన్నాడు...ముచ్చట తీరాక కొండమీదనుంచి తోసేశాడు. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్ లోని జైపూర్ లో కూరగాయల వ్యాపారం చేసే నరేంద్ర కుమార్ (25) అక్కడే బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్న ఓ యువతి (22) ని ప్రేమ, పెళ్లి పేరుతో బుట్టలో వేసుకున్నాడు. ఈ క్రమంలో యువతి గర్భందాల్చింది. దీంతో అతనిలో అసలు రంగు బయటపడింది. యువతిని అబార్షన్ చేసుకొమ్మని సలహా ఇచ్చాడు. 'వద్దు, పెళ్లి చేసుకుందాం' అని యువతి గట్టిగా చెప్పడంతో ఆమెను ఎలా వదిలించుకోవాలో ప్లాన్ వేసుకున్నాడు. పథకం ప్రకారం సరదాగా షికారు అంటూ నహర్ గర్ కొండ మీదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై రాయితో దాడి చేశాడు. 150 అడుగుల కొండపై నుంచి కిందికి తోసేశాడు. అదృష్టవశాత్తు కింద ఏపుగా పెరిగిన పొదల్లో యువతి సురక్షితంగానే పడింది. స్పృహలోకి వచ్చిన యువతి కేకలు వేయడంతో, వారిలాగే పర్యాటకానికి వచ్చిన వారు ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. మోసగాడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

  • Loading...

More Telugu News