: చందమామకి ఎన్నేళ్లో తెలుసా?
భూమి చుట్టూ తిరుగుతూ...ప్రతి ఒక్కరితో మామా అని పిలిపించుకుంటున్న చంద్రుడి వయసెంతో తెలుసా? సుమారు 447 కోట్ల సంవత్సరాలని పరిశోధకులు చెబుతున్నారు. సూర్యగోళం ఏర్పడుతున్న క్రమంలో తన సమీపంలోని మరో పాక్షిక గ్రహం మధ్య తీవ్రమైన గురుత్వ బలాల మధ్య విడిపోయిన పదార్థం చంద్రుడిగా ఏర్పడిందని, ఈ పాక్షిక గ్రహాల మధ్య ఉన్న గ్రహశకల బెల్టును భారీ ఖగోళ పదార్థాలు ఢీ కొట్టడంతో వెలువడిన తీవ్రమైన వేడి కూడా చంద్రుడు ఏర్పడడానికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ ఘటన 447 కోట్ల ఏళ్ల క్రితం జరిగిందని, అపోలో వ్యోమనౌక తీసుకొచ్చిన పదార్థ నమూనాలు అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు తెలిపారు.