: కెనడా నుంచి మోదీ...చైనా నుంచి బాబు స్వదేశానికి వచ్చేశారు
విదేశీ పర్యటనలు ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వదేశానికి తిరిగి వచ్చారు. మూడు దేశాల్లో తొమ్మిది రోజుల విదేశీ పర్యటనను మోదీ ముగించగా, చైనాలో ఐదు రోజుల పర్యటనను చంద్రబాబు పూర్తి చేశారు. అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా, పెట్టుబడులను ఆకర్షించేందుకు మోదీ ఫ్రాన్స్, జర్మనీ, కెనడాల్లో పర్యటించగా, చైనా కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పర్యటన సాగింది. ద్వైపాక్షిక సంబంధాలను మోదీ బలపరిస్తే, పారిశ్రామిక సంబంధాలను బాబు పటిష్ఠం చేశారు. ఢిల్లీ, పాలంలోని టెక్నికల్ ఎయిర్ ఫోర్స్ బేస్ కి ప్రత్యేక విమానంలో మోదీ చేరగా, ఆయనకు ఢిల్లీ నేతలు స్వాగతం పలికారు. హైదరాబాదులో బాబుకు పార్టీ నేతలు స్వాగతం పలికారు.