: ఏపీ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు విధి విధానాలివే!


రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ విధివిధానాలు ఖరారు చేసింది. వైద్య, దంత కళాశాల్లో ప్రవేశాల ప్రక్రియ, రుసుముల విధి విధానాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్, దంత వైద్యలో 'ఏ' కేటగిరీ సీట్లకు కేవలం పదివేల రూపాయలు ఫీజుగా నిర్ణయించింది. 'బీ' కేటగిరీ సీట్లకు 11 లక్షల రూపాయలను ఫీజుగా ఖరారు చేసింది. 'సీ' కేటగిరీ సీట్లకు ఏడాదికి గరిష్ఠంగా 55 లక్షల రూపాయలను ఫీజుగా ప్రభుత్వం ప్రకటించింది. దంత వైద్య కోర్సుల్లో 'బీ' కేటగిరీ సీట్లకు 4.5 లక్షల రూపాయలు, 'సీ' కేటగిరీ సీట్లకు గరిష్ఠంగా 22 లక్షల రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. 'ఏ' కేటగిరీ సీట్లకు సాధారణ ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనుండగా, 'బీ' కేటగిరీ సీట్లకు ఎంసెట్ అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ ద్వారా ప్రవేశాలు జరగనున్నాయని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News