: నాన్నపై ఆకాశమంత ప్రేమ కురిపించిన తనయ!


ప్రేమను వ్యక్తం చేసేందుకు ఒక్కొక్కరిదీ ఒక్కో భాష, ఒక్కో స్పందన... తండ్రిపై ఉన్న ఆకాశమంత ప్రేమను చూపేందుకు ఓ కుమార్తె పడిన ప్రయాస గిన్నిస్ బుక్ లో స్థానం కల్పించింది. తన ప్రేమను అంతరిక్షంలో ఉన్న తండ్రికి చెప్పేందుకు ఏకంగా నేలనే కాన్వాస్‌ గా మార్చింది. అంతరిక్షంలో ఉన్న తన తండ్రితో మాట్లాడే వీలు లేక సంక్షిప్త సందేశం పంపింది. ఆస్ట్రోనాట్ అయిన తన తండ్రికి, 13 ఏళ్ల స్టెఫానీ వినూత్నంగా ప్రేమ సందేశాన్ని పంపింది. నెవెడా ప్రాంతంలోని డెలమార్ సరస్సులో ‘స్టెఫ్ లవ్స్ యూ’ అనే సందేశాన్ని రాయించింది. దీనికోసం బాలిక ఓ కార్ల కంపెనీ సహాయం తీసుకుంది. సరస్సులో ఈ సందేశం రాసేందుకు 11 కార్లు, ఒక హెలికాప్టర్‌ ను ఆ కంపెనీ ఉపయోగించింది. అంతరిక్షంలో ఉన్న స్టెఫానీ తండ్రి ఈ ఆర్ట్ చూసి కెమెరాలో బంధించి పులకించిపోయాడట. తండ్రికి పంపిన సందేశం చాలా పెద్దదిగా ఉండడంతో, అది గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది.

  • Loading...

More Telugu News