: మా వ్యతిరేకతలో ప్రజాశ్రేయస్సే తప్ప రాజకీయం లేదు: జైరాం రమేష్


భూసేకరణ సవరణ బిల్లును వ్యతిరేకించడంలో ప్రజాశ్రేయస్సే తప్ప రాజకీయ కోణం లేదని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ తెలిపారు. నాగ్ పూర్ లో ఆయన మాట్లాడుతూ, భూసేకరణ బిల్లుకు నిరసనగా ఏప్రిల్ 19న రైతులతో కలిసి ఢిల్లీలో ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. బిల్లు పాసైతే సమాజంలో చెడు ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తాము భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వ నిర్ణయాలకు తాము మద్దతివ్వబోమని జైరాం రమేష్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News