: పాత్రికేయురాలికి జైలు శిక్ష...చైనాలో ఆందోళన
ప్రముఖ కమ్యూనిస్టు పార్టీకి చెందిన రహస్య పత్రాలను బహిర్గతం చేసిందన్న కేసులో ప్రముఖ చైనా పాత్రికేయురాలు గావో యూకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై స్థానికులు ఆ దేశ రాజధాని బీజింగ్ లో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. గావోకు శిక్ష వేయడం పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని వారు నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. ఓ పత్రికా సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న గావో యూకు స్థానికంగా మంచి పేరుంది. దీంతోనే స్థానికులు ఆమెకు మద్దతిస్తున్నారు.