: జీహెచ్ ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ భయపడటం లేదు: మంత్రి తలసాని
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే నిర్వహించడం లేదంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. వార్డుల పునర్విభజన ప్రక్రియ వల్లే ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. అంతేగాని గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ ఏ మాత్రం భయపడటం లేదని వివరించారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు అనవసరంగా నోరు పారేసుకోవద్దని మంత్రి హితవు పలికారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలు (ఎమ్మెల్సీ ఎన్నికలు) వేరు, గ్రేటర్ ఎన్నికలు వేరన్నారు. వాపును చూసి బలుపు అనుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు.