: మూడు దేశాల పర్యటన ముగించుకున్న మోదీ... నేడు తిరుగు ప్రయాణం


ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు దేశాల పర్యటన ఈ రోజుతో ముగిసింది. పర్యటనలో భాగంగా ఫ్రాన్స్, జపాన్, కెనడా దేశాల్లో ప్రధాని పర్యటించారు. దానిపై మోదీ మాట్లాడుతూ, ఈ పర్యటన భారత్-కెనడా సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. తన మూడు దేశాల పర్యటన ముగిసిందని, కెనడియన్ సిటీ నుంచి తిరుగు ప్రయాణమవుతానని తెలిపారు. "ఎంతో సంతృప్తితో నేను కెనడా నుంచి తిరిగి వెళుతున్నా. కెనడా ప్రజలకు చాలా కృతజ్ఞతలు" అని మోదీ ట్వీట్ చేశారు. అంతేగాక కెనడా ప్రధానమంత్రి స్టీఫెన్ హార్పర్ కు ధన్యవాదాలు తెలిపారు. "మంచి హోస్ట్, అద్భుతమైన మానవతావాది, ప్రియమైన స్నేహితుడు" అని ప్రశంసించారు. ఈ నెల 9నుంచి ప్రధాని తన మూడు దేశాల పర్యటనను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ తొమ్మిది రోజుల పర్యటనలో ప్రధాని మూడు దేశాలతో కీలక విషయాలపై చర్చించారు. ఫ్రాన్స్ తో 36 రాఫైల్ ఫైటర్ జెట్స్ సరఫరా అంశం, కెనడాతో యురేనియం దిగుమతిపై ఒప్పందాలు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News