: మోదీకి డ్రెస్సులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు: షబ్బీర్ అలీ


ప్రధాని నరేంద్ర మోదీకి రకరకాల డ్రెస్సులు ధరించడం మీద ఉన్న శ్రద్ధ దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలపై లేదని తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాలు రాక్ సింగర్ ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. క్షణానికో డ్రెస్సు మారుస్తున్న మోదీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా విదేశీ పర్యటనకు వెళ్లారా? లేక దేశ ప్రధానిగా వెళ్లారా? అని ఆయన నిలదీశారు. వివిధ దేశాల్లో పర్యటిస్తున్న మోదీ, ఆయా దేశాల్లోని దేవాలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన సూటిగా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News