: మరింత పెరిగిన భారత వృద్ధి అంచనా: మూడీస్


2015 ఆర్థిక సంవత్సరంలో ఇండియా 7.3 శాతం జీడీపీ వృద్ధి సాధించగలదని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. గత సంవత్సరంలో వేసిన అంచనా 7.2 శాతంతో పోలిస్తే, వడ్డీ రేట్లు తగ్గడం, ప్రైవేటు రంగంలో నిధుల వెల్లువ తదితర కారణాలతో ఆర్థిక వృద్ధి మరికాస్త పెరగనుందని తెలిపింది. "మేము పరిశీలించిన అంశాలు తొలి త్రైమాసికంలో 7.3 శాతం జీడీపీ సాధ్యమేనని చూపుతున్నాయి. దేశవాళీ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అంచనాలు సవరించాల్సి వచ్చింది" అని మూడీస్ వెల్లడించిన అధ్యయనం తెలియజేసింది. కాగా, ఈ వారం ప్రారంభంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సైతం భారత జీడీపీ అంచనాలు పెంచుతూ 2015-16లో 7.5 శాతం వృద్ధి నమోదు కావచ్చని పేర్కొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News