: మంచిని మంచిగా... చెడును చెడుగా చూడాలి: కిషన్ రెడ్డికి హరీశ్ సలహా!


బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి టీ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు సలహా ఇచ్చారు. మిషన్ కాకతీయపై ఇటీవల కిషన్ రెడ్డి విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మిషన్ కాకతీయ... కమిషన్ కాకతీయగా మారిపోయిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై కొద్దిసేపటి క్రితం హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను బీజేపీ నేతలైన వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయలు మెచ్చుకుంటున్న విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. ప్రధాని హోదాలో బీజేపీ నేత నరేంద్ర మోదీ చేస్తున్న కొన్ని మంచి పనులను తాము కూడా కీర్తిస్తున్నామని హరీశ్ అన్నారు. మంచి పనులను మంచిగా, చెడు పనులను చెడుగా విమర్శించే స్థాయికి రాజకీయ నేతలు ఎదగాలని ఆయన కిషన్ రెడ్డికి సూచించారు.

  • Loading...

More Telugu News