: రాజేంద్ర ప్రసాద్ కు 237 ఓట్లు, జయసుధకు 152 ఓట్లు... ప్రధాన కార్యదర్శిగా శివాజీ రాజా


మొత్తం 394 ఓట్లు మాత్రమే పోల్ అయిన 'మా' ఎన్నికల్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు 237 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి సహజనటి జయసుధకు 152 ఓట్లు వచ్చినట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. ఆయన 85 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని తెలిపాయి. కాగా, మా ప్రధాన కార్యదర్శిగా శివాజీ రాజా విజయం సాధించారు. తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, 'మా'కు భవనం కడతామని ఆయన తెలిపారు. హామీలు నేరవేరితేనే తమ గెలుపునకు సార్థకత ఏర్పడుతుందని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News