: ఎన్ హెచ్ఆర్సీ తదుపరి చైర్మన్ గా జస్టిస్ సదాశివం
మాజీ చీఫ్ జస్టిస్, కేరళ గవర్నర్ పి.సదాశివం జాతీయ మానవ హక్కుల కమిషన్ తదుపరి చైర్మన్ గా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత చైర్మన్ గా వ్యవహరిస్తున్న కేజీ బాలకృష్ణన్ పదవీకాలం వచ్చే నెలలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్ హెచ్ఆర్సీ చైర్మన్ గా ఉండేందుకు సదాశివం తన అంగీకారం తెలిపారని సమాచారం. గతేడాది సెప్టెంబర్ లో కేరళ గవర్నర్ గా సదాశివంను నియమించిన ఎన్ డీఏ ప్రభుత్వం రెండోసారి ఆయనకు మరో పెద్ద బాధ్యతను అప్పగించబోతుండటం గమనార్హం. ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.