: హ్యాకింగ్ కు గురైన ఏపీ ప్రభుత్వ వెబ్‌సైట్... చెత్త బొమ్మలు పెట్టిన హ్యాకర్లు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భూపరిపాలన కార్యాలయం (సీసీఎల్‌ఏ) వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. సీసీఎల్‌ఏ వెబ్‌ సైట్‌ లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) డిపార్ట్‌ మెంట్ లింకును హ్యాకర్లు తమ వశం చేసుకున్నారు. బూతు బొమ్మలు పెట్టారు. ఈ లింకును క్లిక్ చేస్తే అవే కనిపిస్తున్నాయి. విషయాన్ని తెలుసుకున్న సీసీఎల్‌ఏ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ నిపుణుల సహకారంతో, వాటిని తొలగించి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News