: కార్తీక్ వెడ్స్ సందీప్... హిందూ సంప్రదాయంలో ఒకటైన ఎన్ఆర్ఐ 'గే'లు
ఇద్దరు భారతీయ అమెరికన్లు... స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డ అబ్బాయిలు... కలసి జీవించాలని అనుకున్నారు. విషయం తల్లిదండ్రులకు చెబితే, మొదట షాక్ తిన్నా, ఆ తరువాత అంగీకరించారు. దీంతో తిరువనంతపురం నివాసి, అమెరికాలో సెటిలైన సందీప్, అమెరికాలోనే పుట్టిన కార్తీక్ లు అచ్చ మలయాళీ సంప్రదాయంలో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరిద్దరికీ మూడేళ్ల క్రితం ఒక డేటింగ్ వెబ్ సైట్ లో పరిచయం అయిందట. వీరి వివాహం సాధారణ పెళ్లికి ఏమాత్రం తగ్గకుండా ఘనంగా జరుగగా, బంధుమిత్రులు కానుకలు ఇచ్చి మరీ ఆశీర్వదించారు. వీరి వివాహం సామాజిక మాధ్యమాల్లో బయటకు రాగా, ప్రసుతం పెళ్లి ఫోటోలు చక్కర్లు కొడుతూ, మరింత మంది 'గే'లకు స్ఫూర్తిగా నిలుస్తోందట.