: ఛత్తీస్ గఢ్ లో మావోల ప్రజా కోర్టు... అపహరించిన గిరిజనులను వార్నింగిచ్చి వదిలేశారు!
మావోయిస్టులు క్రమంగా బలం పుంజుకుంటున్నారు. నిన్నటిదాకా మెరుపు దాడులు, కిడ్నాపులతోనే సరిపెట్టిన మావోయిస్టులు తాజాగా ప్రజా కోర్టులకు తెరతీశారు. ఛత్తీస్ గఢ్ లోని మల్కన్ గిరి జిల్లా పులసపాడులో రాత్రి మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల అపహరించిన పది మంది గిరిజనులను మావోయిస్టులు ప్రజా కోర్టులో హాజరుపరచారు. తమకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారన్న అనుమానంతోనే మావోలు గిరిజనులను అపహరించారు. ప్రజా కోర్టులో భాగంగా గిరిజనులు తమ తప్పు ఒప్పుకున్నారట. దీంతో భవిష్యత్తులో ఈ తరహా తప్పు జరిగితే సహించేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన మావోలు, గిరిజనులను వదిలేసి వెళ్లిపోయారట.