: కొనసాగిన ‘రాయల్స్’ జైత్రయాత్ర... విశాఖలో సన్ రైజర్స్ కు చేదు అనుభవం!


విశాఖలో నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు చేదు అనుభవమే మిగిలింది. వరుస విజయాలతో దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టును హైదరాబాదు జట్టు నిలువరించలేకపోయింది. అంతకుమునుపు మ్యాచ్ లో విజయంతో కాస్త గాడిలో పడిందనుకున్న సన్ రైజర్స్ నిన్నటి మ్యాచ్ లో బోల్తా పడింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్, హైదరాబాదును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ ఐదు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కట్టుదిట్టమైన రాజస్థాన్ బౌలింగ్ నేపథ్యంలో ఒక్క సన్ రైజర్స్ బ్యాట్స్ మన్ కూడా అర్ధ శతకం సాధించలేకపోయారు. ఆ తర్వాత 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్ధాన్ కు ఓపెనర్ అజింక్యా రెహానే(62) శుభారంభాన్నిచ్చాడు. అయితే బౌలింగ్, ఫీల్డింగ్ లలో సన్ రైజర్స్ రాణించడంతో రాజస్థాన్ చివరి బంతి దాకా విజయం కోసం పోరాడాల్సి వచ్చింది. చివరి బంతిని ఫోర్ గా మలిచి జేమ్స్ ఫాల్కనర్ రాజస్థాన్ కు విజయాన్ని అందించాడు. 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్, ఆరు వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాదుపై జయకేతనం ఎగురవేసింది.

  • Loading...

More Telugu News