: టీమిండియాలో ఫాస్ట్ బౌలింగ్ శకం వస్తుంది: వసీం అక్రమ్
భారత క్రికెట్ లో ఫాస్ట్ బౌలింగ్ శకం ప్రారంభం కానుందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తెలిపాడు. కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ, భారత క్రికెట్ లో ఫాస్ట్ బౌలింగ్ అంతర్భాగం కానుందని అన్నాడు. ఐపీఎల్ కోల్ కతా నైట్ రైడర్స్ కోచ్ గా వ్యవహరిస్తున్న వసీం ఆధ్వర్యంలోనే అశోక్ దిండా, ఇషాంత శర్మ అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. యువ ఆటగాళ్లు షమీ, ఉమేష్ యాదవ్ ఫాస్ట్ బౌలింగ్ లో రాటుదేలుతున్నారని, వారిని హీరోలుగా వర్థమాన ఆటగాళ్లు భావిస్తున్నారని వసీం తెలిపాడు.