: టీమిండియా తదుపరి కోచ్ గా గంగూలీ?... బీసీసీఐ అధ్యక్షుడిని కలసి చర్చించిన దాదా


ప్రస్తుత టీమిండియా కోచ్ గా కొనసాగుతున్న డంకన్ ఫ్లెచర్ స్థానంలో భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ నియామకం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఓ ఆంగ్ల వార్తా పత్రిక సమాచారం ప్రకారం, ఫ్లెచర్ స్థానంలో కోచ్ గా గంగూలీని తీసుకోవాలని బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆసక్తిగా ఉన్నట్టు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ బోర్డులోని ఓ వ్యక్తి చెప్పినట్టు తెలిపింది. ప్రపంచకప్ ముగిసిన తరువాత ఫ్లెచర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో దాల్మియా ఈ ఆలోచన చేసినట్టు పత్రిక పేర్కొంది. ఈ క్రమంలో కోచ్ పదవిని ఆశిస్తున్న గంగూలీ ఈరోజు దాల్మియాను కలసి చర్చించినట్టు తెలిసింది. కోచ్ పదవి రేసులో గంగూలీతో పాటు ప్రవీణ్ ఆమ్రే, ఆర్.శ్రీధర్ (హైదరాబాద్)లు కూడా ఉన్నారట. ఈ నెల 26న టీమిండియా కోచ్ పదవికి ఎంపిక జరగనుంది. కాగా బీసీసీఐ డైరెక్టర్ గా రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ కు చోటు దక్కనున్నట్టు వినికిడి.

  • Loading...

More Telugu News