: 'మా' ఎన్నికలపై హైకోర్టులో ఓ.కల్యాణ్ పిటిషన్... ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని విజ్ఞప్తి
'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) అధ్యక్ష ఎన్నికల వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడించుకోవచ్చంటూ హైదరాబాదు సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును నటుడు ఓ.కల్యాణ్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని, తిరిగి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ వ్యవహారంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఇదిలాఉంటే, సివిల్ కోర్టు తీర్పు ప్రకారం రేపు లేదా ఎల్లుండి 'మా' అధ్యక్ష ఫలితాలు వెల్లడికానున్నాయి.