: ముంబయిలో ఆశా బోస్లే, శరద్ పవార్ మైనపు విగ్రహాలు ఆవిష్కరణ
ప్రముఖ గాయని ఆశా బోస్లే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మైనపు విగ్రహాలను ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఉన్న ఎంసీఏ లాంజ్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆశా హాజరై తన విగ్రహాన్ని తనివితీరా చూసుకున్నారు. ఈ విగ్రహాలను సునీల్ సెలెబ్రిటీ మైనపు మ్యూజియం రూపొందించింది. ఈ సందర్భంగా ఆశా మాట్లాడుతూ, "లండన్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియం చూశాక భారత్ లోనూ అలాంటి మ్యూజియం ఒకటి ఉండాలని అనుకునే దాన్ని. నా మైనపు విగ్రహం తయారుచేయమని పవార్ జీ సునీల్ సెలెబ్రిటీ మ్యూజియం వారిని అడిగారు. ఆయన వల్లే ఇది సాధ్యమైంది" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్... లతా మంగేష్కర్, ఆశాలను ప్రశంసించారు.