: అమెరికాలో కన్నుమూసిన మరో తెలుగుతేజం


ఉన్నత విద్యను అభ్యసించేందుకు కోటి ఆశలతో అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, కందుకూరుకు చెందిన శైలేంద్ర హర్ష బీటెక్ తర్వాత ఎంస్ చేయడం కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. శైలేంద్ర తండ్రి పంచాయితీరాజ్ విభాగంలో ఏఈగా పనిచేస్తున్నారు. గడచిన ఉగాది పండగకు వస్తానని చెప్పి రాలేదని, ఇక ఎప్పటికీ రాకుండా పోయాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

  • Loading...

More Telugu News